"రాజధాని కోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న మహిళలను ప్రభుత్వం హింసించడం దారుణం" అని మాజీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం ప్రశ్నించే రైతులు, మహిళలు, దళితులను హింసిస్తారా అని వైకాపాపై ధ్వజమెత్తారు. సర్కారు అమానుష చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు ప్రభుత్వంపై అభిమానం ఎక్కువైతే, వారు ఉద్యోగాలు వదిలి వైకాపాలో చేరాలని సూచించారు.
రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం భూములివ్వడమే రైతులు చేసిన నేరమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం హేయమైన చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. రైతులు, మహిళలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పి, వారిపై పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని డిమాండ్ చేశారు.