ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహిళలపై దౌర్జన్యం హేయమైన చర్య: దేవినేని ఉమా

By

Published : Mar 9, 2021, 10:19 PM IST

మహిళా దినోత్సవం రోజున మహిళలపై పోలీసుల దాడిని మాజీ మంత్రి దేవినేని ఉమా ఖండించారు. అన్నం తింటున్న వారిపై దాడి చేసి.. వారిపై కేసులు నమోదు చేయటాన్ని తప్పుపట్టారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

former minister devineni uma has condemned the police attack on women in vijayawada
మహిళలపై దౌర్జన్యం హేయమైన చర్య: దేవినేని ఉమా

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలపై దౌర్జన్యం హేయమైన చర్యని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. అన్నం తింటున్న మహిళలపై దాడి చేసి... వారిపై కేసులు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు సెక్షన్లతో కూడిన తప్పుడు కేసులు నమోదు చేశారని ధ్వజమెత్తారు. రైతులు, మహిళల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని మండిపడ్డారు.

వంద శాతం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామని పార్లమెంటులో చెప్తే ..లేఖలు రాస్తూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ఇది ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపించారు. పోస్కో కంపెనీలతో లాలూచీ పడి విశాఖలో ఆస్తులు కొట్టేయడానికి రాజధాని నెపంతో కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. 22నెలల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించారని విమర్శించారు. ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి

కేంద్రంపై ఒత్తిడి తేవడంలో వైకాపా ఎంపీలు విఫలం : వడ్డే శోభనాద్రీశ్వరరావు

ABOUT THE AUTHOR

...view details