ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో తొలిసారిగా... గుర్రపు డెక్కకు డ్రోన్​తో చెక్..! - జగ్గయ్యపేటలో చెరువుల శుభ్రం న్యూస్

చెరువుల్లో పేరుకున్న గుర్రపు డెక్కను తొలగించటం శ్రమతో కూడుకున్న పని. ఎంతో మంది రోజుల తరబడి చెమటోరిస్తే కానీ దీనిని తీసివేయటం కుదరదు. అయితే ఈ సమస్యకు డ్రోన్​తో చెక్ పెడుతున్నారు కృష్ణా జిల్లా వాసులు. ఎన్నో రోజులు పట్టే పనిని నాలుగైదు రోజుల్లో పూర్తయ్యేలా చూస్తున్నారు.

ponds cleaning
drone

By

Published : Nov 27, 2019, 8:19 PM IST

ఏపీలో తొలిసారిగా... గుర్రపు డెక్కకు డ్రోన్​తో చెక్..!

రాష్ట్రం​లో తొలిసారి డ్రోన్​తో గుర్రపుడెక్క తొలగింపునకు శ్రీకారం చుట్టారు. 2015లో పొలం పనుల కోసం డ్రోన్ కనిపెట్టి... స్ఫూర్తిగా నిలిచిన కంకిపాడు యువకుడు అంబుల గోపీరాజు... ఇప్పుడు రాష్ట్రంలో చెరువుల ప్రక్షాళనకు తన సాంకేతికత ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని 100 ఎకరాల ఊర చెరువులో... చేపల సొసైటీ ఆధ్వర్యంలో గుర్రపు డెక్క తొలగింపులో నిమగ్నమయ్యారు.

గత నెలలో శ్రామికులతో చెరువులో గుర్రపుడెక్క తొలగించాలని చూసినప్పటికీ అది సాధ్యం కాలేదు. చెరువులోకి దిగే అవకాశం లేక పనిని నిలిపేశారు. చెరువు సుందరీకరణతో పాటు, చేపల పట్టివేతకు అడ్డుగా ఉన్న గుర్రపుడెక్క తొలగించేందుకు చేపల సొసైటీ వారు... గోపీరాజా సాయం తీసుకున్నారు. అతను 10 మంది యువ సాంకేతిక బృందంతో చెరువులో గుర్రపు డెక్కపై మందు పిచికారీ చేస్తున్నారు.

రోజుకి 20 నుంచి 30 ఎకరాల మేర పిచికారీ చేసేందుకు 16 లీటర్ల సామర్థ్యంతో కొత్త డ్రోన్ రూపొందించారు. ఇప్పటి వరకూ తెలంగాణ ఆక్వా, ఇతర చెరువుల్లో సేవలు అందించిన గోపీ బృందం తొలిసారి... ఆంధ్రప్రదేశ్​ చెరువుల్లో తమ ప్రక్రియ ప్రారంభించారు. మరో రెండు రోజుల్లో పేట చెరువులో గుర్రపు డెక్క పూర్తిగా నిర్మూలిస్తాం అంటున్నారు గోపీరాజా.

ఇదీ చదవండి

పెళ్లయిన ఏడేళ్లకు ప్రేమ... భార్యకు మళ్లీ పెళ్లి!

ABOUT THE AUTHOR

...view details