ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కాపాడే క్రమంలో తెలిసింది..వీరంతా కరోనా బాధితులని' - covid center taja news

'ఓ భవనంలో అగ్నిప్రమాదం అని... మాకు ఫోన్ వచ్చింది.. రెండు మూడు నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకున్నాం... మంటలను అదుపుచేశాం.. లోపల ఉన్న వాళ్లను బయటకు తీసే క్రమంలో వారి చేతికి ఉన్న బ్యాండ్లు చూసి అర్థమయింది.. వీరంతా కరోనా బాధితులని. భయంతో వదిలేయలేం.. ప్రాణాలకు తెగించి వారందరనీ అక్కున చేర్చుకుని కాపాడాం' అంటున్నారు....విజయవాడ స్వర్ణప్యాలెస్​లో జరిగిన అగ్నిప్రమాదంలో పాల్గొన్న ఫైర్ సిబ్బంది.

fire department reuse corona patients from swarna pales covid care center fire broken  even not protect themselves from corona
fire department reuse corona patients from swarna pales covid care center fire broken even not protect themselves from corona

By

Published : Aug 9, 2020, 1:15 PM IST

కరోనా బాధితుల్ని కాపాడిన తీరు వివరిస్తున్న అగ్నిమాపక సిబ్బంది అధికారి

ప్రస్తుతం కరోనా పాజిటివ్ అంటే అయినోళ్లు కూడా అంటరానోళ్లలా చూస్తున్నారు... అలాంటిది కరోనా రోగులను కనీసం పీపీఈ కిట్లు కూడా లేకుండా ప్రాణాలకు తెగించి కాపాడారు అగ్నిమాపక సిబ్బంది. విజయవాడ స్వర్ణప్యాలెస్​లో ఉన్న బాధితులను ఎటువంటి పీపీఈ కిట్లు కూడా లేకుండా అగ్నిప్రమాదం నుంచి కాపాడారు... అగ్నిమాపక సిబ్బంది. విధి నిర్వహణలో భాగంగా డ్యూటీ చేశాం... కానీ ఇప్పుడు ఇంటికెళ్లాలంటే కుటుంబం గుర్తుస్తోందని కంటతడిపెడుతున్నాడు... ఓ అధికారి. కరోనా భయం మనిషి మానవత్వాన్ని మరుగున పడేసింది.. అయినోళ్లును దూరం చేసింది. బంధాలను భరించలేమనుకునేలా చేసింది... ఇలాంటి పరిస్థితుల్లో ఆ బాధితులను కాపాడినందుకు ఓ పక్క గర్వంగా ఉన్నా.. తమ వల్ల వారి భార్యాపిల్లలు కరోనా బారిన పడతారేమో అని భయపడుతున్నారు.

ఏదేమైనా...ఫైర్ సిబ్బంది భయపడకుండా కరోనా బాధితులను కాపాడటంతో ప్రాణనష్టం కాస్తఅయినా తగ్గిందని స్థానికులు అంటున్నారు.

ఇదీ చూడండి
కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 11కుచేరిన మృతుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details