ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో మళ్లీ పాము కాట్లు - snake byte

కృష్ణాజిల్లా నూజివీడులో ఇటీవల కాలంలో పాము కాట్లు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఇరువురు రైతులు పాముకాటు గురయ్యారు.

farmers_faceing_problems_in_krishna_district

By

Published : Aug 10, 2019, 9:52 AM IST


వ్యవసాయ పనులు నిర్వహించే రైతు కూలీలు నిత్యం పాముకాటుకు గురై ఆసుపత్రి పాలవుతున్నారు. మళ్లీ మరో ఇద్దరు పాముకాటుకు గురయ్యారు. నూజివీడు మండలం మరి బంధం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి గోవిందమ్మ వరి ఊడ్పు కొనసాగిస్తుండగా.. పాము కాటు వేసింది. చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ ఈసం పల్లి రమేశ్​ చేనులో ఉండగా...పాము కాటుకు గురయ్యారు. ఇరువురు నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సకాలంలో వైద్యం అందడంతో అపాయం లేదని వైద్యులు తెలిపారు.

కృష్ణా జిల్లాలో మళ్లీ పాము కాట్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details