విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగల బలం వైకాపాకు ఉన్నప్పటికీ... ఆ దిశగా ఆ పార్టీ ఎంపీలు చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. రామాయపట్నంలో మేజర్ పోర్టును కేంద్రమే నిర్మాణం చేపట్టేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలన్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణంతో ప్రకాశం, రాయలసీమ ప్రాంతాలకు మేలు జరుగుతుందని వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. బందరు పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని డిమాండ్ చేశారు.
కేంద్రంపై ఒత్తిడి తేవడంలో వైకాపా ఎంపీలు విఫలం : వడ్డే శోభనాద్రీశ్వరరావు - వడ్డే శోభనాద్రీశ్వరరావు నేటి వార్తలు
వైకాపా ఎంపీల తీరుపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయనీయకుండా కేంద్రంపై ఒత్తిడి తేవడంతో ఆ పార్టీ ఎంపీలు విఫలమయ్యారని ఆరోపించారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు