ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫేస్​బుక్ ఫ్రెండ్..నగలతో ఉడాయించాడు..! - ఫేస్ బుక్ లో పరిచయంతో దొంగతనం వార్తలు

ఫేస్​బుక్ పరిచయంతో మిత్రుని ఇంటికే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. హాయ్​తో మొదలుపెట్టి మొత్తం వివరాలు తెలుసుకున్నాడు. ఏదో వంక పెట్టుకుని మీ ఊరు వచ్చా...మీ ఇంటికి రావొచ్చా అంటూ మిత్రుని ఇంటికి వస్తు, వెళ్తుండేవాడు. అలా వచ్చినప్పుడు ఇంట్లో ఉండే పరిస్థితులను పసిగట్టాడు. ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు అదును చూసుకుని బంగారు ఆభరణాలతో ఉడాయించాడు.

ఫేస్​బుక్ ఫ్రెండ్..నగలతో ఉడాయించాడు
ఫేస్​బుక్ ఫ్రెండ్..నగలతో ఉడాయించాడు

By

Published : Oct 15, 2020, 8:04 PM IST

Updated : Oct 15, 2020, 8:38 PM IST

ఫేస్​బుక్​ పరిచయం బంగారు నగల చోరీకి దారితీసింది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామంలో జరిగిన ఈ చోరీని పోలీసులు చాకచక్యంతో ఛేదించారు. డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం...నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన వసంత శ్రీ, ఆమె భర్తకు ఫేస్​బుక్​లో ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన కర్నాటి ప్రవీణ్ పరిచయం అయ్యాడు. ఫేస్​బుక్ పరిచయంతో కర్నాటి ప్రవీణ్ వసంతశ్రీ వాళ్ల ఇంటికి అప్పుడప్పుడు వస్తుండేవాడు. అలా ఇంటికి వచ్చినప్పుడు సుమారు రూ. 3 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశాడు.

కేసు వివరాలు తెలుపుతున్న డీఎస్పీ శ్రీనివాసులు

ఈ నెల 1వ తేదీన బంగారు నగలు చోరీకి గురైనట్లు వసంత శ్రీ, ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఫేస్​బుక్ కర్నాటి ప్రవీణ్​ నిందితుడని నిర్ధారణ చేశారు. నూజివీడు శివాలయం వద్ద ప్రవీణ్​ను పట్టుకున్న పోలీసులు.. అతని వద్ద నుంచి నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన నూజివీడు గ్రామీణ ఎస్సై సీహెచ్ రంజిత్ కుమార్, సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.

ఇదీ చదవండి :రాష్ట్రంలో కొత్తగా 4,038 కరోనా కేసులు

Last Updated : Oct 15, 2020, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details