కరోనా వ్యాప్తిని అడ్డుకునే విషయంలో చిత్తశుద్ధిలేని... ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాటుతోందని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మచిలీపట్నంలో మాట్లాడుతూ.. మద్యం దుకాణాలను ప్రభుత్వం వెంటనే మూసేయాలని డిమాండ్ చేశారు.
'వైకాపా ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది'
వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే విషయంలో చిత్తశుద్ధి లేదన్నారు. ఇప్పుడు మద్యం దుకాణాలు తెరిచి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతోందని ధ్వజమెత్తారు.
వైకాపా ప్రభుత్వంపై కొల్లు రవీంద్ర విమర్శలు
లాక్ డౌన్ కారణంగా అధిక శాతం ప్రజలు ఉపాధి కోల్పోయిన దృష్ట్యా 2 నెలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులతో పాటు ఆస్తిపన్ను, ఇంటిపన్నులను రద్దు చేయాలని కోరారు. జే-ట్యాక్స్ చెల్లించిన వారికే మద్యం తయారీ అనుమతులు ఇచ్చారని ఆరోపించారు.
ఇవీ చదవండి..'రమ్మంటారా? ఇప్పుడే వస్తా....ఏం చేయమంటారో చెప్పండి...!
TAGGED:
kollu ravindra fires on ycp