రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని జనసేన నాయకులు మంగళవారం కలిశారు. నాలుగు జిల్లాల్లో రౌడీ మూకలు కౌంటింగ్ కేంద్రాల వద్ద రెచ్చిపోయే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత కల్పించాలని కోరారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఈవో వారికి వివరించారని మాదాసు గంగాధరం మీడియాకు తెలిపారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు జనసేన సహకరిస్తుందని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌పై తమకు విశ్వాసం లేదని... మార్పు కోసం పోటీచేసిన జనసేనకు ఎమ్మెల్యే సీట్ల కంటే ప్రజల నమ్మకమే ముఖ్యమన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత పెంచాలని సీఈవోకు జనసేన వినతి - dwivedi
రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదిని జనసేన నాయకులు కలిశారు. నాలుగు జిల్లాల్లో రౌడీ మూకలు కౌంటింగ్ కేంద్రాల వద్ద రెచ్చిపోయే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు.
జనసేన