కృష్ణా జిల్లా నందిగామలో వనం - మనం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి. రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో స్థానిక కె.వి.ఆర్ కళాశాలలో సిబ్బంది మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు పెంచటం ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా మెుక్కలు పెంచి పర్యావరణ సమతుల్యతకు పాటు పడాలన్నారు. స్థానిక శాసనసభ్యులు జగన్మోహనరావు తో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ విధిగా మెుక్కలు పెంచాలి : ఎస్పీ - trees
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మెుక్కలు నాటాలని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ స్పష్టం చేశారు. నందిగామలో వనం -మనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ విధిగా మెుక్కలు పెంచాలి