కృష్ణా నది వరద నీరు పొలాల్లోకి, జనవాసాల్లోకి వస్తుండటంతో అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. వరద పెరగటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెం,బొబ్బర్లంక గ్రామాలలో వరద నీరు ఇళ్లలోకి రావటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం..పునరావాసాలకు ప్రజలు తరలింపు - మోపిదేవి
కృష్ణాజిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మోపిదేవి మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. కృష్ణా నది నిండుకుండను తలపిస్తోంది.
పునరావాసాలకు తరలింపు