ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకోవాలి' - విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

విజయవాడలో బీమా, వైద్య సేవల సిబ్బంది నిరసన చేపట్టారు. ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ESI staff protest in vijayawada
విజయవాడలో ఆందోళన

By

Published : Sep 28, 2020, 7:21 PM IST

ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ... విజయవాడలో బీమా, వైద్య సేవల సిబ్బంది ఆందోళన చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.

ఈఎస్ఐ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని, విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఈఎస్ఐ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు.

ABOUT THE AUTHOR

...view details