కృష్ణాజిల్లా నందిగామలో స్థానిక ఎలక్ట్రికల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. 21 రోజులు చేయాల్సిన రీడింగులను 9 రోజులకే రీడింగ్ లు పూర్తి చేయాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై ఒక్క రోజు నిర్వహించిన సమయంలో రూ.18000 జీతాలు వస్తే పదిహేను రోజులకు రూ. 13000 వచ్చాయని ప్రస్తుతం తొమ్మిది రోజులకు రూ.8000 మాత్రమే వస్తున్నాయని వాపోయారు. దానివల్ల కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా ఏప్రిల్ నెల జీతం జమ చేయాలని.. ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
నందిగామలో విద్యుత్ మీటర్ రీడర్స్ ఆందోళన - కృష్ణాజిల్లా వార్తలు
విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కృష్ణాజిల్లా నందిగామలో స్థానిక ఎలక్ట్రికల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
విద్యుత్ మీటర్ రీడర్స్ ఆందోళన