ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడలో పోటాపోటీగా ప్రచారం - devineni avinash

గుడివాడ నియోజకవర్గంలో తెదేపా, వైకాపా అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన వైకాపా నేత కొడాలి నాని.... మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటిసారి బరిలోకి దిగుతున్న దేవినేని అవినాశ్... తాను గెలిస్తే నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో నడిపిస్తానని అంటున్నారు.

గుడివాడలో ప్రచారం జోరు

By

Published : Mar 18, 2019, 10:57 PM IST

గుడివాడలో ప్రచారం జోరు
కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడుతున్నారు.3సార్లు గెలిచిన అనుభవం ఉన్ననేతపై...కొత్తగా ఓ అభ్యర్థిపోటిపడుతున్నాడు. ప్రజల్లో అభిమానమే తనకు మరోసారి పట్టం కడుతుందని కొడాలి ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఒక్కసారి అవకాశమిస్తే నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని తెదేపా అభ్యర్ధి దేవినేని అవినాష్ హామీ ఇస్తున్నారు. ఇద్దరునేతలు ప్రచారంలోనూ హోరాహోరీగాపోటీ పడుతున్నారు.

కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గంలో తెదేపాను గెలిపిస్తే ప్రతి ఇంటికి కొడుకునై ఉంటానని ఆ పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ అంటున్నారు. గుడివాడలోఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరినీ కలుస్తూ తెదేపాకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తెదేపా శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని అవినాష్​కు స్వాగతం పలుకుతున్నారు.

కలిసొచ్చిన వాహనంపై కొడాలి నాని
ప్రచారంలో తనకు ఎంతగానో కలిసి వచ్చిన వాహనంపైనే కొడాలి నాని ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. 3దఫాలుగా తెలుగుదేశం తరఫున, రెండు సార్లువైకాపా తరుఫున గెలిచారు. ఒకసారి ఎన్నిక ప్రచారంలో వాడిన వాహనం తనకు బాగా కలిసి వచ్చిందని... ఈసారి ప్రచారంలోనూ ఇదే వాహనాన్ని వాడుతున్నానని కొడాలి నాని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details