ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

175 స్థానాలు... 3,925 నామినేషన్లు

రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించారు.

By

Published : Mar 26, 2019, 8:04 PM IST

Updated : Mar 26, 2019, 8:51 PM IST

గోపాలకృష్ణ ద్వివేది

గోపాలకృష్ణ ద్వివేది మీడియా సమావేశం
రాష్ట్రంలో మొత్తం 25 లోక్ సభ స్థానాలకు 548 నామినేషన్లు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. గరిష్ఠంగా నంద్యాలకు 38, అత్యల్పంగా చిత్తూరులో 13 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. 15 కంటే ఎక్కువ నామినేషన్లు 17 చోట్ల వచ్చాయని తెలిపారు. అలాగే రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకి 3 వేల 925 నామినేషన్లువచ్చినట్లుప్రకటించారు.వీటిలోఅత్యధికంగానంద్యాలనియోజకవర్గానికి61,అత్యల్పంగాపార్వతీపురం, పాలకొండ స్థానాలకు10 నామినేషన్లు వచ్చాయని తెలిపారు. 118నియోజకవర్గాల్లో 15 కంటే ఎక్కువనామినేషన్లు వచ్చాయని వివరించారు.

12 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
ఆంధ్రాలో మొత్తం 3 కోట్ల 93లక్షల 45 వేల717 ఓటర్లు ఉన్నారని ద్వివేది పేర్కొన్నారు. జనవరి 11 తర్వాత 25 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యారన్నారు. రాష్ట్రంలో 2 వేల 614 ఫిర్యాదులు సీ-విజిల్ యాప్ ద్వారా,.. 734 కేసులుఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులునమోదు చేశారని వెల్లడించారు. ఇవేకాక 12 కోట్ల 13 లక్షల ఖరీదైన బంగారం తనీఖీల్లో పట్టుబడిందని తెలిపారు. కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయానికి పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఐటీ గ్రిడ్ విషయంలో ఏపీ, తెలంగాణ సిట్ కు సహకరిస్తామని స్పష్టం చేశారు

Last Updated : Mar 26, 2019, 8:51 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details