కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రైతుల వివరాలను ఈ కర్షక్ లో నమోదు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. రైతులు , కౌలుదారులు తమ పంటలను ఈ కర్షక్ లో నమోదుచేసుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే లభాలను సైతం వివరిస్తున్నారు.
వ్యవసాయ ప్రణాళిక, ఇన్ పుట్స్, బుణ ప్రణాళిక , వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ , పంట నష్టాల తాలుకా ఇన్ పుట్ సబ్సిడీ, పంటల బీమా పధకము, బుణ సదుపాయము, రైతు బరోసా, విత్తనాలు, ఎరువులు పొందటానికితి ఉపయోగపడుతుంది. ప్రతి రైతు తమ పొలముకు సంబదించిన పత్రాలు. తమ ఆధార్ నెంబరు, పోన్ నెంబరుతో తాము పండించే పంట పొలములో వేసిన పంటను జీపీఎస్ ఉపయోగించి రైతు ఫోటోతో సహా ఈ- కర్షక్ యాప్ లో నమోదు చేస్తారు.