ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుర్గమ్మ సన్నిధిలో చేతివాటం.. ఇద్దరు కాదు.. ఐదుగురు!! - హుండీ

విజయవాడ కనకదుర్గమ్మ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించేందుకు తీసుకెళ్తుండగా చేతివాటం ప్రదర్శించిన సిబ్బంది వ్యవహారంలో.. మరికొందరి ప్రమేయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు దేవస్థానం స్వీపర్‌ సింహాచలం, అతని భార్య, కాంట్రాక్టు ఉద్యోగి దుర్గను విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

durga_temple_chori

By

Published : Jun 6, 2019, 9:46 PM IST

దుర్గమ్మ సన్నిధిలో చేతివాటం..ప్రదర్శించింది ఐదుగురు!

కనక దుర్గమ్మ హుండీలో భక్తులు సమర్పించిన కానుకల్లో చేతివాటం ప్రదర్శించిన ముగ్గురి దగ్గర నుంచి 12 గ్రాముల బంగారు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు.. మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. స్వీపర్‌ సింహాచలం బంగారంతో పాటు పదివేల రూపాయలు నగదు చోరీ చేసినట్లు తేల్చారు. ఈ నగదును మార్గమధ్యంలో మరో ఉద్యోగికి అందించినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరిపైనా కేసులు నమోదు చేశారు. దుర్గగుడిలో నిఘా మరింత పటిష్ఠం చేస్తామని, హుండీ లెక్కింపు సమయంలో...మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆలయ ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన సెక్యూరిటీ సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details