ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐదుగురు వైద్యులకు రూట్స్ ఫౌండేషన్ పురస్కారాలు - వైద్యలకు పురస్కారాలు

విలువలు పాటిస్తూ వృత్తిపై నిబద్ధత, సేవాభావంతో పనిచేస్తున్న వైద్యులకు పురస్కారాలు అందజేయనున్నామని రూట్స్‌ ఫౌండేషన్‌ తెలిపింది.

కరపత్రాలను చూపుతున్న రూట్స్ ఫౌండేషన్ వైద్యులు

By

Published : Jul 5, 2019, 6:20 PM IST

రూట్స్ ఫౌండేషన్ తరుపున వైద్యలుకు పురస్కారాలు....

సేవాగుణంతో ఉన్నత సేవలు అందిస్తున్న వైద్యులకు రూట్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. పదేళ్లుగా పురస్కారాలు అందిస్తున్న సంస్థ... 2019 సంవత్సరానికిగాను ఈనెల 7వ తేదీన విజయవాడలోని సిద్ధార్థా ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించనుంది. ఐదుగురు వైద్యులకు అవార్డులు అందచేస్తున్నట్లు ఫౌండేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ విజయభాస్కర్‌ తెలియజేశారు. విజయవాడకు చెందిన డాక్టర్‌ కె.వెంగళరావుకు, క్యాన్సర్‌ అవగాహనపై కృషిచేస్తున్న డాక్టర్‌ ఎస్‌.సుబ్బారావుకు, 40 సంవత్సరాలుగా గ్రామప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో ఉచిత సేవలు అందిస్తున్న డాక్టర్‌ దుత్తా రామచంద్రరావుకు, ఆయుర్వేద వైద్య విభాగంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రభుత్వ వైద్యులు డాక్టర్‌ కె.మాధవ్‌రావ్‌ చౌదరికి, మానసిక వికలాంగులకు స్త్రీలకు సేవలు అందిస్తున్న శ్రీమతి మాధవిలతను ఎంపిక చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details