వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని... కృష్ణాజిల్లా గుడివాడలో భవిష్యత్ భద్రతాదళం సభ్యుడు వైవీ మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలు పెడచెవిన పెట్టి... పలు ప్రైవేటు పాఠశాలలు వ్యక్తిత్వ వికాసం పేరుతో తరగతులు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టిచుకోవడం లేదని... తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు.
అధికారులు స్పందించలేదని... వినూత్న నిరసన - భవిష్యత్ భద్రతాదళం
ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెట్టాయని... భవిష్యత్ భద్రతాదళం సభ్యుడు వైవి మురళీకృష్ణ నిరసన వ్యక్తం చేశారు. వేసవిలోనూ తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారులు స్పందించలేదని... వినూత్న నిరసన