నవ్యాంధ్ర డీజీపీగా నియమితులైన గౌతమ్ సవాంగ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. గతంలో విజయవాడ నగర పోలీసు కమిషనర్గా ఉన్నప్పుడు తరచూ దుర్గమ్మ ఆలయానికి వెళ్లేవాడిననీ.. పదవీ బాధ్యతలు స్వీకరించేముందు అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చానని తెలిపారు. ఆలయ ఈవో కోటేశ్వరమ్మ డీజీపీకి సాదర స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని డీజీపీకి అందజేశారు.
దుర్గమ్మ సేవలో నూతన డీజీపీ గౌతమ్ సవాంగ్ - temple
రాష్ట్ర డీజీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు గౌతమ్ సవాంగ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దుర్గమ్మ సేవలో నూతన డీజీపీ గౌతమ్ సవాంగ్