ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో 2రోజుల వ్యవధిలో 5 వందల కేసుల నమోదు

దేశవ్యాప్తంగా వివిధ దశల్లో జరుగుతున్న పోలింగ్​కు ఏపీ పోలీసులు ఇతర రాష్ట్రాల్లో సేవలందిస్తున్నారు.

పోల్ వార్

By

Published : Apr 18, 2019, 8:02 PM IST

పోల్ వార్

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కేంద్ర బలగాలలు పహారా కాస్తున్నందున... ఆంధ్రప్రదేశ్ నుంచి 10 ప్లాటూన్ల పోలీసు బలగాలను ఒడిశా పంపినట్లు డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఒడిశా, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సక్రమంగా నిర్వహించేందుకు కూంబింగ్ ఆపరేషన్స్ చేపట్టామన్నారు. ఆంధ్రప్రదేశ్​లో ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో మొత్తం 501 కేసులు నమోదయ్యాయని ఠాకూర్ తెలిపారు. పోలింగ్ రోజున 372 కేసులు, ఆ తరువాత రోజు 129 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. 501 కేసుల్లో 4వేల105 మందిని నిందితులుగా గుర్తించామని.. 50 శాతం కేసులకు సంబంధించి నిందితులను అరెస్టు చేశామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికల వేళ గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో మరోసారి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ సూచించారు. దీనిలో భాగంగానే కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పోలీసులతో సమావేశం ఏర్పాటుచేశారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని వారికి సూచించారు .

ABOUT THE AUTHOR

...view details