Devineni Uma released : కృష్ణా జిల్లా మైలవరం రెవెన్యూ డివిజన్ కోసం రాస్తారోకో చేసిన తెదేపా నేత దేవినేని ఉమాను స్టేషన్ బెయిల్‌పై పోలీసులు విడుదల చేశారు. దేవినేని ఉమాను అరెస్ట్ చేసి క్రమంలో తోపులాట జరగ్గా....పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. స్టేషన్‌కు బలవంతంగా తీసుకెళ్లే క్రమంలో దేవినేని ఉమ గాయపడ్డారు. దేవినేని ఉమాతో పాటు పలువురు నేతలపై 143,341,149 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. పోలీసుల కారణంగానే తమ నాయకుడు గాయపడ్డారని కార్యకర్తలు ఆరోపించారు.
Devineni Uma released : మైలవరం పీఎస్ నుంచి దేవినేని ఉమ విడుదల - మైలవరం పీఎస్ నుంచి దేవినేని ఉమ విడుదల
Devineni Uma released : కృష్ణాజిల్లా మైలవరంను రెవెన్యూ డివిజన్ కోసం రాస్తారోకో చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు విడుదల చేశారు. దేవినేని ఉమాను అరెస్ట్ చేసి క్రమంలో తోపులాట జరగ్గా....పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పులవురికి గాయాలయ్యాయి. పోలీసుల కారణంగానే తమ నాయకుడు గాయపడ్డారని కార్యకర్తలు ఆరోపించారు.
Devineni Mma Arrest at Mylavaram: కృష్ణా జిల్లా మైలవరంలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్టు చేశారు. మైలవరాన్ని రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. మైలవరం రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో దేవిని ఉమ ఆందోళన చేపట్టారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో దేవినేని ఉమను అరెస్టు చేసి మైలవరం పీఎస్‌కు తరలించారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించిన తెదేపా శ్రేణులు.. దేవినేనిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :మైలవరాన్ని రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించాలని దేవినేని ఉమ రాస్తారోకో... అరెస్ట్