సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. కృష్ణా జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర రావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
'ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు' - TDP FIRES ON YSRCP RULE
వైకాపా పాలనలో ఇసుక, మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. తప్పులను ఎత్తిచూపిన ప్రతిపక్ష నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
వైకాపా పాలనపై దేవినేని ఉమా
అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఇసుక అక్రమాలపై తహసీల్దార్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణా పెద్దఎత్తున జరుగుతున్నాయని... దీనికి అధికార పార్టీ నాయకులు బాధ్యులని విమర్శించారు
ఇదీ చదవండి: తెదేపా ఎమ్మెల్యే పై వైకాపా వర్గీయుల రాళ్లదాడి...కార్యకర్తలకు గాయాలు