ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'సీఎం గారూ.. రైతు సమస్యలపైనా మాట్లాడండి'

By

Published : Apr 28, 2020, 2:43 PM IST

రైతుల సమస్యలపైనా సీఎం జగన్ మాట్లాడాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. వారి సమస్యలు ఎలా పరిష్కరిస్తున్నదీ చెప్పాలని కోరారు. సీఎం జగన్ ప్రజలను చిన్నచూపు చూస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

devineni uma fires on cm jagan
సీఎం జగన్​పై దేవినేని ఉమా వ్యాఖ్య

రైతుల బాధలపై సీఎం జగన్‌ మాట్లాడాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్​ చేశారు. కష్టపడి పండించిన పంట చేతికొచ్చినా అమ్ముకునే దిక్కులేని రైతు దీనమైన స్థితిని ఎదుర్కొంటున్నాడని ఆవేదన చెందారు. తడిసిన ధాన్యం, దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వా రైతులను ఏవిధంగా ఆదుకుంటారో వివరించాలని కోరారు. జగన్‌ చెప్పిన 3000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి గురించి… కరోనాపై పెట్టినట్లే ఒక రికార్డెడ్ లైవ్ ప్రెస్ మీట్​లో చెప్పగలరా అని ఉమా నిలదీశారు.

కరోనా అంటే చిన్నపాటి జ్వరమని, వస్తుంది, పోతుందని సీఎం జగన్‌ సెలవిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆక్షేపించారు. కానీ కొవిడ్‌-19 ప్రధానంగా శ్వాసకోస వ్యవస్థపైనే ప్రభావం చూపుతుందని, ప్రాణాంతకమని డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కానీ.. సీఎం మాత్రం కొత్త అర్ధాలు చెబుతున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details