తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.60 వేల కోట్ల అవినీతి జరిగిందని వైకాపా చేసిన విమర్శలు నిరూపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. వైకాపా నేతలు విమర్శలు చేసిన... నీరు చెట్టు పథకం దేశానికే ఆదర్శమని స్వయంగా కేంద్ర మంత్రే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ను పొగుడుతుంటే... రాష్ట్ర మంత్రులు అవినీతి జరిగిందని గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి పోలవరంపై పీటర్ కమిటీ నివేదికలు ఇప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలో పోలవరంలో తట్టెడు సిమెంటైనా వేశారా అని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ అంతా డ్రామా అని... సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు.
రివర్స్ టెండరింగ్ ఓ డ్రామా: దేవినేని ఉమ - polavaram
తెదేపా ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని వైకాపా చేస్తున్న విమర్శలు నిరూపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోలవరం పూర్తిచేయాలని చెప్పారు. రివర్స్ టెండరింగ్ ఓ డ్రామాగా ఆయన అభివర్ణించారు.
దేవినేని ఉమామహేశ్వరరావు