దేవినేని అవినాష్ సోదరి ప్రచారం కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ తన సోదరుడిని గెలిపించాలని కోరారు. ముస్లిం మైనారిటీల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలుతెలుసుకున్నారు. 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో కనబడడం తప్ప ప్రజలకు అందుబాటులో ఉండరని ఆరోపించారు. అవినాష్‌ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని, అందరికీ అందుబాటులో ఉంటారనిహామీ ఇచ్చారు.
ఇవీ చదవండి..