'గుడివాడను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం' - gudivada
రాష్ట్రంలో కీలక స్థానమైన గుడివాడలో తెదేపా అభ్యర్థి అవినాష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ శ్రేణుల్లో ఉత్సహం నింపుతున్నారు.
తెదేపా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కృష్ణా జిల్లా గుడివాడ స్థానాన్ని తెదేపా యువనేత దేవినేని అవినాష్‌కు కేటాయించారు. సీఎం చంద్రబాబు తనపై ఉన్న నమ్మకంతో శ్రేణులో ఉత్సాహం నింపుతూ అవినాష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రచారం చేపట్టిన అవినాష్ ముందుగా కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ కాలనీలో ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి తెదేపాను గెలిపించవలసిందిగా ఓటర్లను కోరారు. ఒక్క అవకాశం ఇస్తే గుడివాడ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.