కృష్ణా జిల్లా దేవపూడి తపాలా కార్యాలయం ఉద్యోగి.. డిపాజిట్ దారులకు టోకరా వేశాడు. 20 మంది నుంచి సుమారు రూ.20 లక్షలు డిపాజిట్ సొమ్మును స్వాహా చేశాడు. పాస్ బుక్లో నమోదు చేయకుండా డిపాజిట్ సొమ్మును వసూలు చేసి పరారయ్యాడు. నిందితుడు దాదాపు నెలన్నరగా పరారీలో ఉన్నాడని బాధితులు తెలిపారు. దేవపూడి పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామని, అయినా అధికారులు పట్టించుకోవటం లేదని బాధితులు వాపోయారు.
తపాలా కార్యాలయం ఉద్యోగి చేతివాటం.. డిపాజిట్ దారులకు రూ.20 లక్షలు టోకరా! - Devapudi post office employee took clients' money
కృష్ణా జిల్లా దేవపూడి తపాలా కార్యాలయం ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. ఆకౌంట్లో నగదు జమ చేయకుండా డిపాజిట్ దారుల నుంచి రూ.20 లక్షల సొమ్మును కాజేశాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.
Devapudi post office