తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం నారాయణస్వామి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎంకు తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
'నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేసుకోండి' - తెలంగాణ సీఎం కేసీఆర్ వార్తలు
నీటి వివాదం రోజురోజుకు ముదురుతున్న వేళ.. ఘర్షణ వాతావరణం వద్దని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మనవి చేశారు. నీరు పుష్కలంగా ఉన్నపుడు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చునని స్పష్టం చేశారు.
తెలుగు రాష్టాల సీఎంలకు ఒకరిపై మరొకరికి అభిమానం ఉందని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు నీరిచ్చి ఆదుకోవాలనే తపన తెలంగాణ సీఎంకు ఉందని... గతంలో తిరుమలకు వచ్చిన కేసీఆర్ వ్యాఖ్యానించారని నారాయణస్వామి తెలిపారు. తెలుగు ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం వద్దని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. నీరు పుష్కలంగా ఉన్నపుడు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేయడం సరైన పద్ధతి కాదన్నారు
ఇదీ చూడండి.TG CM KCR: నికర జలాల్లో రెండు రాష్ట్రాలు చెరిసగం వినియోగించుకోవాలి: కేసీఆర్