కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో ముంపులో చిక్కుకున్న లంక గ్రామాల్లో మచిలీపట్నం ఎంపీ బాలశౌరితోపాటు ఎమ్మెల్యేలు కైలా అనిల్ కుమార్, కొలుసు పార్థసారథి పర్యటించారు. మండలంలోని నాలుగు పునరావాస కేంద్రాలకు వెళ్లి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. వరద ముంపు తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంటనష్టంపై అంచనా వేసి ప్రభుత్వం తరపున రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
"పునరావాస కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ" - mp
వరద ప్రభావిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీ బాలశౌరి, శాసనసభ్యులు కైలా అనిల్ కుమార్, కొలుసు పార్థసారథి అధికారులకు సూచించారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధులు