ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింక్‌ వాట్సప్ అంటూ కొత్త తరహా మోసం

సైబర్‌ నేరగాళ్లు ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారు. అందమైన అమ్మాయిలు, ఆకర్షణీయ ఆఫర్లకు ఎవరూ చిక్కడం లేదనుకున్నారో ఏమో.. ఇప్పుడు వాట్సప్‌ పింక్‌ కలర్‌ అంటూ లింకుల ఎర వేస్తున్నారు. అలాంటివి క్లిక్‌ చేస్తే చాలు..మీ అరచితిలో ఉండే ఫోన్‌ డేటా మీకు తెలియకుండానే సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది.

cyber-crime-with-pink-whatsapp-link-in-vijayawada
పింక్‌ వాట్సప్ అంటూ కొత్త తరహా మోసం

By

Published : Apr 21, 2021, 7:15 AM IST

సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా వాట్సప్ పింక్‌ లింక్‌ దోపిడీ వైరల్‌గా మారింది. సాధారణంగా వాట్సప్ ఆకుపచ్చరంగులో ఉంటుంది. మహిళలు, ముఖ్యంగా యువతులను ఆకర్షించేలా మీ వాట్సప్ పింక్‌ రంగులోకి మారాలంటే ఈ లింక్ క్లిక్‌ చేయండంటూ మెసేజ్‌లు పంపుతున్నారు. అది నిజమని నమ్మి లింక్‌ క్లిక్‌ చేశారా ఇక అంతే.! మీ ఫోన్‌లో ఏపీకే ఫైల్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. ఫోన్‌ సైబర్‌ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. ఇక చెప్పేదేముంది. మీ రహస్య సమాచారాన్ని తస్కరిస్తారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ ద్వారా ఖాతా ఖాళీ చేస్తారు. అదనపు డబ్బుకోసం బ్లాక్‌మెయిల్ చేస్తారు. అమెజాన్ లాంటి ప్రముఖ సంస్థల పేరిట ఆఫర్లు ఇస్తున్నామంటూ లింక్ లు పంపుతుంటారని వాటిలో జాగ్రత్తగా పరిశీలించి నకిలీలను పసిగట్టాలంటున్నారు పోలీసులు.

పింక్‌ వాట్సప్ అంటూ కొత్త తరహా మోసం

ఇప్పటివరకు ఈ మెయిల్ ద్వారా హ్యాకింగ్‌కు పాల్పడిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు డొమైన్ హ్యాకింగ్‌ను ఆయుధంగా మార్చుకున్నారని సైబర్ నిపుణులు చెప్తున్నారు. ఆంగ్ల అక్షరాల్నిపోలిన అక్షరాల్ని వినియోగించి నకిలీ డొమైన్‌లు తయారు చేసి బాధితులకు లింక్​లు పంపుతున్నారు. వాటిని క్లిక్ చేయగానే పైన కనపడే డొమైన్‌కు అనుసంధానం చేసిన ఏపీకే ఫైల్స్ ఫోన్‌లో ఇన్ స్టాల్ అవుతుంది. ఈ ఏపీకే ఫైల్స్‌ సాధారణంగా పైకి కనపడవని నిపుణులు చెప్తున్నారు. పొరపాటున క్లిక్ చేస్తే డిలీట్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. పింక్‌ వాట్సప్‌ లింకులేకాదు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఏ సందేశాన్నీ గుడ్డిగా నమ్మొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవీచదవండి.

నేటి నుంచి ఐదురోజుల పాటు గుంటూరు మిర్చియార్డుకు సెలవులు

'దిల్లీలో ఆక్సిజన్​ కొరత లేకుండా చూస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details