కొద్ది రోజుల క్రితం కురిసి వర్షాలకు కృష్ణా జిల్లా కోడూరు మండల వ్యాప్తంగా హంసలదీవి, పాలకాయ తిప్ప, ఉల్లిపాలెం, దింటి మెరక గ్రామాలలో పంటలు నీటమునిగాయి. ముంపునకు గురైన పొలాలను మాజీ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్, తెదేపా నేతలు పరిశీలించి రైతులను పరామర్శించారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
'నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి'
కృష్ణా జిల్లా కోడూరు మండలంలో ఇటీవల కురిసిన వానలకు పంటలు నీటమునిగాయి. ముంపునకు గురైన ప్రాంతాల్లో మాజీ ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్ తనయుడు వెంకట్రామ్ పర్యటించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహరం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలి
వర్షం కురిసి 20 రోజులు కావస్తున్నా ఇంత వరకు మునిగిన పంట పొలాలు నీరు బయటికి పోయే విధంగా స్థానిక ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎటువంటి చర్యలు తీసుకోపోవటం బాధాకరమన్నారు. తక్షణమే వర్షానికి నీట మునిగిన ప్రతి ఎకరానికి 20 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. పాలకాయ తిప్ప వద్ద డ్రైన్ అవుట్ ఫాల్స్ పునర్ నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి