కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కరకట్ట లోపలి వైపు ఉన్న పొలాలు నీటమునిగాయి. మోపిదేవి మండలంలోని కొక్కిలిగడ్డ, కొత్తపాలెం, హరిజనవాడలోకి వరద నీరు చేరగా.. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాతఎడ్లలంకలో వరద ఉద్ధతికి కాజ్వే కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో మచిలీపట్నం ఆర్డీఓ ఎస్. కే. ఖాజావలి పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితులకు సహాయకచర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.