ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీపీఎస్​ను వెంటనే రద్దు చేయాలి' - latest protest in vijayawada

విజయవాడలో సీపీఎస్ ఉద్యోగులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్నికల సమయంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను.. అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

cps employes protest in vijayawada
విజయవాడలో సీపీఎస్ ఉద్యోగుల ఆందోళన

By

Published : Apr 1, 2021, 2:59 PM IST

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్​ను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని విస్మరించారని సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు యాదవ్ అన్నారు. విజయవాడ ధర్నా చౌక్ లో ఉద్యోగులతో కలిసి ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు.

మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్​గా భావిస్తున్నామన్న ముఖ్యమంత్రి జగన్... తన వ్యాఖ్యలకు కట్టుబడి సీపీఎస్​ను రద్దు చేయాలని కోరారు. కమిటీలతో కాలయాపన చేయకుండా ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details