ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పెంచిన పాల ధరలు వెంటనే తగ్గించాలి'

విజయ సంస్థ పాల ధర పెంచడాన్ని నిరసిస్తూ విజయవాడలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబురావు నిరసన చేపట్టారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని.. పాల ఉత్పత్తి సంఘాల‌ు, సహకార సంఘాల‌కు ప్రభుత్వం తోడ్పాటునివ్వాలని కోరారు.

cpm state president ch baburao protest in vijayawada
సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

By

Published : May 9, 2020, 5:25 PM IST

పాల ధరల పెంపును నిరసిస్తూ విజయవాడ వన్ టౌన్ పాల ఫ్యాక్టరీ వద్ద సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబురావు నిరసన చేపట్టారు. ధరలు తగ్గించాలని కోరుతూ విజయ సంస్థ యాజమాన్యానికి వినతిపత్రం సమర్పించారు. ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని... నిత్యావసర సరకుల ధరలు పెంచకూడదని చెప్పి, ఇప్పుడు పాల ధరలు పెంచడం ఎంతవరకు సమంజసమని బాబూరావు అన్నారు. పాల‌ ధర లీటరుకు రూ.2 నుంచి రూ.4కు విజయ సంస్థ పెంచిందని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండి, సహకార సంఘాలు నిర్వహించే సంస్థల్లోనే ధరలు పెరిగితే.. ప్రైవేటు సంస్థలు ఎలా అదుపులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్పప్పుడు ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇలా చేయడం సరికాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details