ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 28, 2019, 11:15 AM IST

ETV Bharat / state

"భాజపా, ఆర్ఎస్ఎస్​ల హిందుత్వం... సమాజ ధర్మానికి వ్యతిరేకం"

సెక్యులరీజం ప్రమాదంలో ఉందని సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ తెలిపారు. లౌకిక విలువలను కాపాడడమే రాజ్యాంగ పరిరక్షణ అనే విషయానేని పాలకులు మరిచారన్నారు. భాజపా, ఆర్ఎస్ఎస్​ల హిందుత్వం... సమాజ ధర్మానికి వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు.

లౌకిక విలువలను కాపాడడమే రాజ్యాంగాన్ని కాపాడటమన్న ప్రకాష్ ఖారత్

లౌకిక విలువలను కాపాడడమే రాజ్యాంగాన్ని కాపాడటమన్న ప్రకాష్ ఖారత్

విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఙాన భవనంలో నిర్వహించిన సభలో వర్తమాన రాజకీయ పరిస్థితిలపై సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ ప్రసంగించారు. దేశంలో భాజపా ఏక పార్టీగా అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ... ప్రజాసౌమ్యం మతతత్వ శక్తుల చేతులోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో భాజపాతో ఎలా తలపడాలనే విషయం కీలకమైందని... దీనికోసం ప్రతిపక్ష పార్టీలు ఇప్పటినుంచే ప్రజల నుంచి విశ్వసాన్ని పొందాలని సూచించారు. పార్లమెంట్ మెంబర్ నుంచి పంచాయతీ మెంబర్ దాకా డబ్బుతో కొనడాన్ని తప్పుబట్టారు. ఎలోక్టరల్ బాండ్స్ ద్వారా భాజపా కొన్ని వేల కొట్లు దండుకుందని... 2019 ఎన్నికల్లో 5వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చుచేసిందని విమర్శించారు. పార్లమెంట్​లో నిరంకుశంగా చట్టాలను ప్రవేశ పెడుతున్న భాజపా... కార్మక చట్టాలను ఏకపక్ష ధోరణితో చేస్తూ... రాష్ట్రాల హక్కులను హరించేలా చేయడాన్ని ఆపివేయాలని ప్రకాశ్ కారత్ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details