ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో కొత్త రాజకీయం రావాలి' - ycp

"రాష్ట్రంలో కొత్త రాజకీయం రావాలి. చంద్రబాబు, కేసీఆర్... వారి పార్టీల సమస్యను రెండు రాష్ట్రాల సమస్యగా మార్చారు. వైకాపా, తెదేపా పరస్పర ఆరోపణలతో రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోవడం లేదు" -రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

రామకృష్ణ

By

Published : Mar 10, 2019, 9:58 PM IST

రామకృష్ణ
డేటా చోరీకి సంబంధించినచర్చలు తారస్థాయికి చేరాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడ దాసరి భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకుండానే వైకాపా, తెదేపా నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారని ఆరోపించారు. చంద్రబాబు, కేసీఆర్ వారి పార్టీల సమస్యను రెండు రాష్ట్రాల సమస్యగా మార్చారన్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయం రావాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలు విదేశాల్లో తిరుగుతుంటే.. ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో వందల కోట్ల రూపాయలనుఅంబానీకి కట్టబెట్టారని ఆరోపించారు.

ఇవీ చదవండి...

ABOUT THE AUTHOR

...view details