ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం' - ఏపీ పరిషత్ ఎన్నికల తాజా సమాచారం

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. గతంలోనే ఎన్నికల నోటిఫికేషన్​ను రద్దు చేయాలని ఎస్ఈసీకి విపక్షాలన్ని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. కరోనా ఉద్ధృతి తగ్గాక మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

cpi ramakrishna
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

By

Published : May 21, 2021, 12:00 PM IST

పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గతంలోనే పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని అధికార వైకాపా మినహా అన్ని పార్టీలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు విజ్ఞప్తి చేశాయని గుర్తు చేశారు. పార్టీల విజ్ఞప్తిని ఎస్ఈసీ పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలను నిర్వహించారని విమర్శించారు. కరోనా ఉద్ధృతి తగ్గాక కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు సజావుగా నిర్వహించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details