అసెంబ్లీ సమావేశాల ముందు తెదేపా నేత అచ్చెన్నాయుడి అరెస్టు సరికాదని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఆయనపై కేసు ఉంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత విచారణ జరపవచ్చుకదా అని సూచించారు. అచ్చెన్నాయుడి అరెస్టుకు వందల మంది పోలీసులను పంపుతారా అంటూ రామకృష్ణ ప్రశ్నించారు. ప్రతిపక్షాన్ని అణగదొక్కే కుట్రగా అచ్చెన్నాయుడి అరెస్టు ఉందన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతుందని ఆయన తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల ముందు అచ్చెన్నాయుడి అరెస్టు సరికాదు: సీపీఐ - అచ్చెన్నాయుడి అరెస్టు
తెదేపా నేత, మాజీ మంత్రి అచ్చన్నాయుడిని అవినీతి నిరోధకశాఖ అధికారులు ఈ రోజు ఉదయం అరెస్టు చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాల ముందు అచ్చెన్నాయుడి అరెస్టు సరికాదని సీపీఐ నేత రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే , తెదేపానేత కింజరావు అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్టు చేశారు. తెదేపా ప్రభుత్వ హయంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. తెదేపా ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈఎస్‌ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ కమిటీ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఇదీ చదవండి:అచ్చెన్నాయుడి కిడ్నాప్‌కు జగన్ బాధ్యత వహించాలి: చంద్రబాబు