కృష్ణా జిల్లాలో నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంటలను సీపీఐ రాష్ట్ర బృందం పరిశీలించింది. ఉంగుటూరు మండలం పొట్టిపాడు వద్ద చెన్నై - కోల్కతా జాతీయ రహదారి పక్కన దెబ్బతిన్న పంట పొలాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. రైతు సంఘాల నేతలతో కలిసి పరిశీలించారు.
పంట నష్టం గురించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి తుపానును జాతీయ విపత్తు ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని కోరారు.