పలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోజుకో దృశ్యం హృదయవిదాకరకంగా మారుతోంది. కోవిడ్ బారినపడి చికిత్స పొందేందుకు గంటల తరబడి నిరీక్షిస్తోన్న వారి వేదనలు అన్నీ ఇన్నీ కావు. బాధితుల ఆవేదన చూడలేక సహాయకులు, వారి బంధువుల కళ్లలో నీరు సుడులు తిరుగుతున్న ఉదంతాలకు లెక్కలేదు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని ఆటో ట్రాలీలో కనిపిస్తోన్న వ్యక్తి పేరు జగదీష్. పాయకాపురం నివాసి. కరోనా లక్షణాలతో నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో పడకల కొరత కారణంగా వైద్యులు మందులు అందజేసి హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు.
ఆస్పత్రుల్లో హృదయ విదారక దృశ్యాలు..బరువెక్కుతున్న గుండెలు
విధిని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఇందుకు ఇటీవలి కరోనా ఉదంతాలే ప్రత్యక్ష ఉదాహరణలు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోజుకో దృశ్యం హృదయవిదారకంగా మారుతోంది. కొవిడ్ బారినపడి చికిత్స పొందేందుకు గంటల తరబడి నిరీక్షిస్తోన్న వారి వేదనలు అన్నీ ఇన్నీకావు. బాధితుల ఆవేదన చూడలేక సహాయకులు, వారి బంధువుల కళ్లలో నీరు సుడులు తిరుగుతున్న ఉదంతాలకు లెక్కేలేదు. ఆసుపత్రిలో తాజాగా కనిపించిన ఓ రెండు ఉదంతాలు అందరీ హృదయాలను కదిలించాయి.
సోమవారం ఉదయం ప్రాణవాయువు అందడం ఇబ్బందికరంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు జగదీష్ కుటుంబ సభ్యులు అంబులెన్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. సుమారు గంటపాటు అంబులెన్స్ కోసం చేయని ఫోన్లు లేవు. ఎక్కడా స్పందన లేకపోవడంతో ఆటోలో ట్రాలీలో పడుకోబెట్టి అతన్ని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్వాస అందేలా చేసేందుకు అతని భార్య తన రెండు చేతులతో గుండెపై గట్టిగా అదిమి తనవంతు ప్రయత్నించారు. ఆసుపత్రికి చేరేసరికే ఊపిరి ఆగిపోయింది. ఆటో నుంచి జగదీష్‌ను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లలేదు. వైద్య సిబ్బంది ఆటోవద్దకు వచ్చి అతనికి పరీక్షలు చేశారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. జగదీష్ ఆటోడ్రైవరు. ఆటో నడుపుతూ బతుకు ప్రయాణం సాగిస్తున్నారు. తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అదే ఆటోలోనే తన జీవన ప్రయాణం ఆగిపోవడం అందరినీ కలచివేస్తోంది. సకాలంలో అంబులెన్స్ దొరికి.. ప్రాణవాయువు అంది ఉంటే తన భర్త బతికి ఉండే వారేమోనని అతని భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇవీ చదవండి