ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిన్నారికి గుండె, కిడ్ని సమస్యలు.. ఆదుకున్న కానిస్టేబుళ్లు

విజయవాడలో నిమోనియో, గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న తొమ్మిదేళ్ల చిన్నారి శ్రావ్యకు.. కానిస్టేబుల్ దంపతులు ఆర్థిక సాయం చేశారు.

By

Published : May 14, 2020, 8:37 AM IST

Published : May 14, 2020, 8:37 AM IST

Constables finances help to a heart and kidney problems child
గుండె, కిడ్ని సమస్యలతో బాధపడుతున్న చిన్నారికి కానిస్టేబుళ్ల ఆర్థిక సాయం

గుంటూరు జిల్లా కతేవరం గ్రామానికి చెందిన శ్రావ్య అనే చిన్నారి గత కొంత కాలంగా గుండె, కిడ్నీ, తదితర సమస్యలతో బాధపడుతోంది. ఇటీవల వైద్యులు ఆమె గుండెకు శస్త్ర చికిత్స చేశారు. పాపను రక్షించేకునేందుకు తల్లితండ్రులు లక్షల రూపాయలు ఖర్చుచేశారు. తండ్రి ఆటో డ్రైవర్ అయిన కారణంగా.. ఇబ్బంది పడుతున్నారు.

సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం తెలుసుకున్న కానిస్టేబుల్ నాగరాజు, మహిళా కానిస్టేబుల్ సువర్ణరేఖ దంపతులు.. వారి మిత్రులు కలిసి 60 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి అందించారు.

వీరితో పాటు 2009 బ్యాచ్ కు చెందిన పోలిస్ కానిస్టేబుల్ 20 వేల రూపాయలు, సోల్జర్ ఫర్ చిల్డ్రన్స్ గ్రూప్ సంస్థ 20 వేల రూపాయలను శ్రావ్యకు ఆర్థిక సాయంగా అందించారు. పోలిసులు చిన్నారికి ఆర్థిక సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని విజయవాడ సీపీ ద్వారకతిరుమలరావు అభినందించారు.

ఇదీ చదవండి:

నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ABOUT THE AUTHOR

...view details