ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగి తూగిన కానిస్టేబుల్.. తరిమేసిన జనం! - కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా నూజివీడులో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ మద్యం మత్తులో చిందులేశాడు. స్థానికులు చుట్టుముట్టి నిలదీసిన పరిస్థితుల్లో బిత్తరపోయి అక్కడ నుంచి చల్లగా జారుకున్నాడు.

మద్యం తాగిన కానిస్టేబుల్ వీరంగం

By

Published : Oct 2, 2019, 12:34 PM IST

మద్యం తాగిన కానిస్టేబుల్ వీరంగం

అసలుకే మద్యం మత్తులో ఉన్నాడు... అందునా పోలీసాయన... తూలుతూ విధులు నిర్వహిస్తున్నాడు...అప్పుడే రోడ్డుపైకి వచ్చిందో వ్యాను. ఇక అంతే... మత్తులో ఉన్న కానిస్టేబుల్... వ్యాన్ డ్రైవర్​పై చిందులేసి, చేయి చేసుకున్నారు. అటువైపు ప్రయాణానికి అనుమతులు లేవన్న విషయం చెబుతూ నానా రభస చేశాడు. స్థానికులు నిలదీయగా.. అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నాడాయన. ఇదంతా కృష్ణా జిల్లా నూజివీడులో జరిగింది. పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వైపు నుంచి గాంధీ విగ్రహం వరకూ వాహనాలకు అనుమతి లేకపోవడం.. అక్కడ విధుల్లో ఉన్న ఈ కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉండడం.. ఈ రభసకు కారణమైంది. ''చేయి చేసుకునే హక్కు మీకెక్కడది'' అని స్థానికులు ప్రశ్నించగా... బిత్తరపోయిన ఆ అధికారి అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details