New PCC committees: తెలంగాణలో పీసీసీ కొత్త కమిటీలపై అసంతృప్తుల లొల్లి ముదురుతోంది. మాజీ మంత్రి కొండా సురేఖ దారిలోనే మరో నేత చేరారు. తనకు కొత్త కమిటీల్లో చోటివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెల్లయ్య నాయక్ పీసీసీ అధికార ప్రతినిధి పదవికి.. రాజీనామా చేశారు. జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ సెల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న తనకు.. పొలిటికల్ ఎఫైర్ కమిటీలో స్థానం ఎందుకు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టీపీసీసీ కొత్త కమిటీలపై ముదురుతున్న అసంతృప్తుల లొల్లి - Congress leaders unhappy new PCC committees
New PCC committees: తెలంగాణలో పీసీసీ కొత్త కమిటీలపై అసంతృప్తుల లొల్లి తారాస్థాయికి చేరుతోంది. మాజీ మంత్రి కొండా సురేఖ దారిలోనే మరో నేత చేరారు. కాంగ్రెస్ కొత్త కమిటీల్లో చోటివ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బెల్లయ్య నాయక్ పీసీసీ ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు.
New PCC committees
ఎస్టీ సామాజిక వర్గ నేతలపై పార్టీలో చిన్న చూపు ఉందని.. బెల్లయ్య నాయక్ పేర్కొన్నారు. గతంలో కూడా పీసీసీలో కోదండరెడ్డి తనకు నిబంధన ప్రకారం అవకాశం ఇవ్వాలని.. మాణిక్కం ఠాగూర్‌కు లేఖ రాసినా.. తమ ఇద్దరికి అవకాశం ఇవ్వలేదని అవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: