ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మంత్రివర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్త్​రఫ్ చేయాలి'

By

Published : Feb 6, 2021, 3:41 PM IST

రాష్ట్ర మంత్రివర్గం నుంచి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గవర్నర్ తక్షణమే బర్త్​రఫ్ చేయాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అధికారులు పాటిస్తే.. బ్లాక్ లిస్ట్​లో పెడతామని పెద్దిరెడ్డి హెచ్చరించడం ద్వారా.. మంత్రి ఎన్నికల కోడ్​ను అతిక్రమించారని తులసిరెడ్డి ఆరోపించారు.

Congress leader Tulasi reddy on Minister Peddhi Reddy
'పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గవర్నర్ తక్షణమే బర్త్​రఫ్ చేయాలి'

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రివర్గం నుంచి గవర్నర్ తక్షణమే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అధికారులు పాటిస్తే బ్లాక్ లిస్ట్​లో పెడతామని మంత్రి హెచ్చరించారని తులసిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి ఎన్నికల కోడ్​ను అతిక్రమిస్తూ.. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించాలని అన్నారు.

జగన్ పాలనలో రాయలసీమకు అడుగడుగునా అన్యాయమే జరిగిందని విమర్శించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు విశాఖలో పెట్టాలనుకోవడం మూర్ఖత్వమని తెలిపారు. బోర్డు కార్యాలయాన్ని శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలోని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇంటి వద్దకే రేషన్ బియ్యం పథకం ఓ పిచ్చి తుగ్లక్ చర్య అని తులసిరెడ్డి విమర్శించారు. దీనివలన వాహనదారులు, వినియోగదారులకు ఎవరికీ ప్రయోజనం లేదని అన్నారు. పాత రేషన్ పద్ధతినే పునరుద్ధరించాలని కాంగ్రెస్ నేత డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్​గా గౌతమ్​రెడ్డి బాధ్యతల స్వీకరణ

ABOUT THE AUTHOR

...view details