ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడాదిలోగా తెలంగాణలో కొత్త సచివాలయం

తెలంగాణలో కొత్త సచివాలయ సముదాయాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. టెండర్ నోటిఫికేషన్​లో ఈ మేరకు గడువును పేర్కొంది

By

Published : Sep 19, 2020, 8:24 PM IST

New Secretariat in Telangana
ఏడాదిలోగా తెలంగాణలో కొత్త సచివాలయం

తెలంగాణలో కొత్త సచివాలయ సముదాయాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. టెండర్ నోటిఫికేషన్​లో ఈ మేరకు గడువును పేర్కొంది. 12 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. వచ్చే నెల 1 వరకు టెండర్ దాఖలుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం... అదే రోజు సాంకేతిక బిడ్లను తెరవనుంది.

ఆర్థిక బిడ్లను వచ్చే నెల 5న తెరుస్తారు. ఈనెల 26న ప్రీబిడ్ సమావేశం జరగనుంది. రూ. 500 కోట్ల అంచనా వ్యయంతో సచివాలయ నిర్మాణం కోసం బిడ్ దాఖలు చేసే కంపెనీ టర్నోవర్ రూ. 750 కోట్లు ఉండాలని, గత ఐదేళ్లుగా ఎలాంటి నష్టాలు వాటిళ్లరాదని స్పష్టం చేసింది. సచివాలయ సముదాయ నిర్మాణ క్రమంలో పర్యావరణ సమతుల్యత పాటించాలని... అక్కడ ఇప్పటికే ఉన్న చెట్లను తొలగించరాదని తెలిపింది. నిర్మాణ సమయంలోనూ.. చెట్లకు నష్టం వాటిళ్లకుండా చూడాలని స్పష్టం చేసింది. నిర్మాణం కోసం అవసరమైతే సంబంధిత ఇంజినీర్ అనుమతితోనే తొలగింపు లేదా తరలించాల్సి ఉంటుందని... ఇందుకయ్యే వ్యయాన్ని సంబంధిత గుత్తేదారు భరించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఇదీ చూడండి:సరకు రవాణాలో వాల్తేరు డివిజన్ దూకుడు

ABOUT THE AUTHOR

...view details