కృష్ణా జిల్లాలో ప్లాస్టిక్ కవర్ల నియంత్రణ దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ప్లాస్టిక్ కవర్లు అధికంగా వినియోగించే రైతు బజార్లను జిల్లా కలెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ తనిఖీ చేశారు. ఈరోజు ఉదయం పటమట రైతు బజార్‌లోని ప్రతి దుకాణాన్ని పరిశీలించిన కలెక్టర్... ప్లాస్టిక్ సంచులు తీసుకొచ్చే కొనుగోలుదారులకు కూరగాయలు విక్రయించవద్దని దుకాణదారులకు సూచించారు. కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్టిక్ సంచులను ప్రతి ఒక్కరూ నిషేధించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ దిశగా జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
'ప్లాస్టిక్ వాడకండి.. వాడనీయకండి' - కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పటమట రైతు బజార్‌ను సందర్శించారు. ప్లాస్టిక్ కవర్ల నియంత్రణ ఎలా కొనసాగుతుందో ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు.
'ప్లాస్టిక్ వాడకండి.. వాడనీయకండి'