ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లబ్ధిదారుల గుర్తింపులో పారదర్శకంగా ఉండాలి'

ఇళ్లస్థలాల లబ్ధిదారుల గుర్తింపులో ఎటువంటి ఆరోపణలకు తావులేకుండా పారదర్శకంగా ఉండాలని తహసీల్దార్లను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. లబ్దిదారుల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణంగా పరిశీలించి అర్హులైన వారితో కూడిన జాబితాను సిద్ధం చేయాలన్నారు.

collector intiaz video conference with tahasildars about house layouts
తహసీల్దార్లతో కలెక్టర్ ఇంతియాజ్ వీడియో కాన్ఫరెన్స్

By

Published : Jun 2, 2020, 12:36 PM IST

ఇళ్లస్థలాల లబ్ధిదారుల గుర్తింపులో ఎటువంటి ఆరోపణలకు తావులేకుండా పారదర్శకంగా ఉండాలని తహసీల్దార్లను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల స్థలాలు, లే అవుట్ ప్రగతి, బియ్యం కార్డులు, పలు రెవెన్యూ అంశాలను జాయింట్ కలెక్టర్ మాధవీలతతో కలిసి కలెక్టర్ ఇంతియాజ్ సమీక్షించారు. మ్యాపింగ్ చేసి సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయాలని... జిల్లాలో లబ్దిదారుల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణంగా పరిశీలించి అర్హులైన వారితో కూడిన జాబితాలను సిద్ధం చేయాలన్నారు.

ఈ విషయంలో ఎటువంటి ఆరోపణలకు తావు లేకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఇళ్లస్థలాల లేఅవుట్ పనులను నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇళ్లస్థలాల కోసం 1400 లేఅవుట్లను సిద్ధం చేయవలసి ఉండగా... ఇప్పటివరకు 1187 లేఅవుట్ల అభివృద్ధి పనులు పూర్తి చేశారని.. మిగిలిన వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.

ఇవీ చదవండి... 'ఏడాది కాలంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details