ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీ పర్యటనను ఖండించాలి: చంద్రబాబు

సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ చేశారు. ప్రజలంతా మోదీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారని వివరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు.

మోదీ పర్యటనపై స్పందించిన చంద్రబాబు

By

Published : Feb 10, 2019, 10:16 AM IST

Updated : Feb 10, 2019, 10:49 AM IST

రాష్ట్రానికి అన్యాయం చేసి మన మనోభావాలతో ఆడుకోవడానికి ప్రధాని మోదీ వస్తున్నారని సీఎం మండిపడ్డారు. వైకాపా మద్దతు చూసుకుని కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పర్యటనకు జగన్ సహకరిస్తున్నారనే విషయం అన్ని గ్రామాలకు వివరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పర్యటనను ఖండించాలన్నారు. శాంతియుతంగా వివిధ రూపాల్లో నిరసనలు తెలపాలని సూచించారు. రాష్ట్రమంతా ఒక వైపు ఉంటే జగన్ ఎక్కడ దాక్కున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ వైఖరినీ ప్రతీ ఒక్కరూ నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజలు నిరసనలు తెలుపుతుంటే.. జగన్ హైదరాబాద్ లో కుట్రలు పన్నుతున్నాడని మండిపడ్డారు. రేపు దిల్లీలో జరిగే దీక్షకు ప్రజలందరి మద్దతు తీసుకోవాలని వివరించారు. మంచి ఐఏఎస్ అధికారులు కూడా జగన్ స్వార్థం వల్లే జైలుకెళ్లారని మండిపడ్డారు.

Last Updated : Feb 10, 2019, 10:49 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details