ఇవాళ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం - కొలువుదీరిన
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మవారికి సీఎం జగన్ నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆయన రాక నేపథ్యంలో ఆలయం వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాటు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మను దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముందుగా ఈ నెల 5న మూలానక్షత్రం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉన్నా... దిల్లీ పర్యటన నేపథ్యంలో ఒక రోజు ముందుగానే అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. ముఖ్యమంత్రి ఆలయానికి వచ్చిన దగ్గర నుంచి పట్టువస్త్రాలు సమర్పించి తిరిగి వెళ్లే వరకు 300 రూపాయల క్యూలైన్లు నిలిపివేస్తున్నట్లు డీసీపీ విజయరావు వెల్లడించారు. పోలీసులు చేపట్టే భద్రతా చర్యలకు భక్తులు సహకరించాలని కోరారు.